ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాను భాజపాలో విలీనం చేయడం మంచిది : శైలజానాథ్ - వైసీపీ బీజేపీ విలీనంపై శైలజానాథ్ కామెంట్స్

భాజపా చేసే ప్రతి పనికి వంత పాడుతున్న వైకాపాను...ఆ పార్టీలో విలీనం చేసేయడం మంచిదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో నిర్వహించిన రైతుల కోటి సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

శైలజానా
శైలజానాథ్ థ్

By

Published : Oct 4, 2020, 4:29 AM IST

వైకాపాను భాజాపాలో విలీనం చేసేయడం మంచిదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో మాట్లాడిన ఆయన... భాజపా చేసే ప్రతి పనికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వంత పాడుతున్నారన్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని శైలజానాథ్‌ విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని జగన్​... సంస్కరణల పేరుతో రైతులను కూలీలుగా మార్చే భాజపా ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నారని శైలజానాథ్‌ విమర్మించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. అనంతరం వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రైతుల నుంచి సంతకాలు సేకరించారు.

ఇదీ చదవండి :రాజధాని వ్యవహారం.. హైకోర్టులో కేంద్రం మెమో దాఖలు

ABOUT THE AUTHOR

...view details