శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ నివాస్ తెలిపారు. మొత్తం 138 కేంద్రాల్లో 37 వేల 203 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశామనీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరుకాని వారి శాతం ఎక్కువగా ఉందనీ.. దీనిపై ఏపీపీఎస్సీకి నివేదిస్తామని వివరించారు.
శ్రీకాకుళంలో 'పంచాయతీ' పరీక్షకు తక్కువ హాజరు - srikakulam
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పరీక్షకు హాజరు శాతం తక్కువగా ఉందనీ.. దీనిపై ఏపీపీఎస్సీకి నివేదిస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో 'పంచాయతీ' పరీక్షకు తక్కువ హాజరు నమోదు