ఏ వస్తువు కొన్నా 50శాతం రాయితీ అన్నాడు... సమయం లేదు స్పందించాలంటూ వినియోగదారులను తొందరపెట్టాడు. ఆశపడి అందరూ భారీగా వస్తువులను కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చారు. 29వ తేదీన ఆఫర్ ముగుస్తుంది.. అప్పుడొచ్చి వస్తువులు తీసుకెళ్లాలన్నాడు. షాపు దగ్గరకు వేల సంఖ్యలో అడ్వాన్స్ ఇచ్చినవాళ్లంతా వచ్చారు... కానీ సీన్ రివర్స్ అయింది. 2 కోట్ల రూపాయిలతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో ఈ ఘటన జరిగింది.
సగం ధరకే ఇస్తానన్నాడు.. అందినకాడికి దోచుకెళ్లాడు - srikakulam dst crime news
శ్రీకాకుళం జిల్లా పొందూరులో నమ్మినవాళ్లను నట్టేట ముంచాడు ఓ వ్యాపారి. సగం ధరకే వస్తువులు ఇస్తానంటే అందరూ వేలల్లో డబ్బులు కట్టారు. ఈనెల 29న వస్తువులు ఇస్తానని నమ్మబలికాడు. అందరూ ఎంతో ఆశతో వచ్చేసరికి పత్తాలేకుండా పోయాడు. ఈ ఘటనతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.
షాపు ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు