ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయమే లేదు.. ఆన్ లైన్లోనే పూజలు

ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో భక్తులు ఆలయానికి వెళ్లకుండానే పూజలు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

srikakulam district
కరోనా భయమే లేదు.. ఆన్ లైన్లోనే పూజలు

By

Published : Jul 31, 2020, 11:28 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ కోటదుర్గమ్మ ఆలయాన్ని లాక్ డౌన్ కారణంగా మూసివేశారు. కేవలం అర్చకులు మాత్రమే అమ్మవారికి ఏకాంత ధూప దీప నైవేద్యాలు అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆలయానికి రాకుండా భక్తుల పేరిట పూజ జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు.

అమ్మవారు బ్యాంకు ఖాతా నెంబరు 1008047319, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏపీజీవీ 0001146 ఖాతాకు రూ. 50 నగదు జమ చేసి వారి వివరాలను, చెల్లించిన నగదు రసీదును 9347199416 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపాలి. భక్తులు సూచించిన రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తామని ఈవో వాసుదేవరావు తెలిపారు.

ఇదీ చదవండి కొవిడ్ ఆస్పత్రి ఆవరణలోనే మహిళ మృతి.. ఒక్క క్లిక్​తో స్పందించిన సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details