ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకు ఉల్లిధరలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం ఆమదాలవలస, రాజాం, కోటబోమ్మాళి రైతుబజార్లలో రాయితీపై ఉల్లిని సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు బజారులో కిలో 40 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఉల్లిపాయలను దిగుమతి చేసిన మార్కెటింగ్ శాఖ ఒకరికి రెండు కిలోల ఉల్లిపాయలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఆ ఉల్లిగడ్డలు కొనేందుకు వినియోగదారులు బారులు తీరారు. అయితే అవి నాసిరకంగా ఉండడంతో వినియోగదారులు గోల పెడుతున్నారు.
సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. - శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం రైతు బజార్లలో ఉల్లి పంపిణీ చేస్తున్నప్పటికీ అని నాసిరకంగా ఉండడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి'