శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కింజరాపువాణి పేట వద్ద ద్విచక్ర వాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బూసి అచ్చన్న పొలం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా...ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నరసన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలాకి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం ఢీ కొని వృద్ధుడు మృతి - కింజరాపువాణి పేటలో రోడ్డు ప్రమాదం వార్తలు
బూసి అచ్చన్న అనే వ్యక్తి పొలం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా... ద్విచక్రవాహనం ఢీ కొని మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కింజరాపువాణి పేటలో జరిగింది.
ద్విచక్రవాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మృతి