ఆంధ్ర-ఒడిశా సరిహద్దు పర్లాకిమిడి జిల్లా కేంద్రం వద్ద ఒడిశా అధికారులు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తిస్తున్న కారణంగా పర్లాకిమిడి జిల్లా కలెక్టర్ అనుపమ సహా పర్యవేక్షణలో.. పాతపట్నం, పర్లాకిమిడి సరిహద్దులను మూసివేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను నిలిపివేస్తున్నారు. అత్యవసరాలు ఉన్నవారిని గుర్తించి అనుమతిస్తున్నారు. రాకపోకలు సాగించే వారికి తనిఖీ కేంద్రం వద్ద కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒడిశాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంధ్ర నుంచి ప్రవేశం లేకుండా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. పర్లాకిమిడి సబ్ కలెక్టర్ శేఖర్, ఎస్పీ తపన్ పండ ఆధ్వర్యంలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
పాతపట్నం, పర్లాకిమిడి సరిహద్దులను మూసివేసిన అధికారులు - పర్లాకిమిడి సరిహద్దును మూసివేసిన అధికారులు
శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో.. ఒడిశా అధికారులు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా.. సరిహద్దులను మూసివేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను నిలిపివేస్తున్నారు.
సరిహద్దుల్లో తనిఖీలు