శ్రీకాకుళం జిల్లా రాజాంలో మందుబాబులు భౌతిక దూరాన్ని మరిచారు. రాజాం పాలకొండ జీఎంఆర్ ఐటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం కొనేందుకు వచ్చిన మందుబాబులు కరోనా నిబంధనలను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించి, గొడుగుల పట్టుకొని మద్యం కొనేందుకు క్యూలో ఉండాలని చెబుతూనే ఉంది. ఎన్ని విధాలుగు ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ పలుచోట్ల ప్రభుత్వ ఆదేశాలను పాటించటం లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇలా మద్యం దుకాణాల వద్ద నిబంధనలు పాటించకపోవటంతో పలువురు వీరి తీరుని విమర్శిస్తున్నారు.
అసలే కరోనా.. అయినా దూరం కరువు... - rajam news
శ్రీకాకుళం జిల్లా రాజాంలో మందుబాబులు భౌతిక దూరాన్ని పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేదు. అందుకు నిదర్శనమే ఈ ఘటన.
రాజాంలో సామాజిక దూరాన్ని మరచిన మందుబాబులు :.
ఇదీ చదవండి పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ ఆలయం మూసివేత