No People In Village At Srikakulam District :స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. దేశం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ ముందుకు దూసుకుపోతోంది. అంతరిక్షయానంలోనూ అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. ఊరిలో కనీస వసతులు లేక గ్రామం మొత్తం వలసబాట పట్టిన పరిస్థితులు మరోవైపు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం కర్నాలపేటలో గ్రామస్థులు వలస బాట పట్టడంతో చివరికి ఊరిలో కేవలం ఒక కుటుంబం మాత్రమే మిగిలింది. కన్నతల్లి లాంటి ఉన్న ఊరిని వదిలి ఉండలేక అభివృద్ధికి దూరంగా ఉంటూ పాడుబడ్డ ఇళ్ల మధ్యే ఆ కుటుంబ సభ్యులు కాలం వెళ్లదీస్తున్నారు.
"పల్లె పొమ్మంటే పట్నం రమ్మంటోంది" బతకలేని బక్క ప్రాణులను వీడని వలసల పర్వం
Immigration Due to No Development :శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటకు 25 కిలోమీటర్ల దూరంలో కర్నాలపేట అనే గ్రామం ఉంది. ఒకప్పుడు వందల మంది ప్రజలతో కళకళ్లాడిన ఈ గ్రామంలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే నివాసముంటున్నారు. ఊరు చుట్టూ పచ్చని చెట్లు పంట పొలాలు ఆహ్లాదకర వాతావరణం. ఊరిలో మాత్రం పాడుబడి శిథిలావస్థకు చేరిన ఇళ్లు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. అయినా సాహసం చేసి ఆ ఊరిలో జగదీశ్వరరావు, శర్వాణి అనే దంపతులు ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అత్యవసర వస్తువులు, నిత్యవసరాలు ఏది కావాలన్నా 5 కిలోమీటర్లు దూరం పొలాల గట్లపై నడుచుకుంటూ వెళ్లాల్సిందేనని వారు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన సేవలు ఆ ఊరికి నేటికీ చేరలేదు.