ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శవపరీక్షా కేంద్రం... సమస్యలకు నిలయం

ఆ గది చుట్టూ చెత్తా చెదారం పేరుకు పోయి ఉంటాయి. నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. రవాణా, విద్యుత్ సరఫరా లేదు. ఈ పరిస్థితికి తోడు చుట్టూ ఆక్రమణలు.. ఇది నరసన్నపేటలోని ఓ శవపరీక్ష కేంద్రం దుస్థితి.

By

Published : May 18, 2019, 4:08 PM IST

అధ్వాన స్థితిలో శవపరీక్షా కేంద్రం

మురికి కూపం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రి ఆధ్వర్యంలోని శవ పరీక్ష కేంద్రం దారుణ స్థితిలో ఉంది. ఆసుపత్రికి అర కిలోమీటరు దూరాన ఉన్న ఈ శవపరీక్ష గదికి వెళితే ఎవరైనా ముక్కు మూసుకోక తప్పదు. అది శవాల కారణంగా అనుకుంటే పొరపాటే. గది చుట్టు పక్కల ప్రాంతం మురికి కూపంలా మారడమే ఈ సమస్యకు కారణమైంది. శవపరీక్ష గదికి కనీసం విద్యుత్ సదుపాయం లేదు. ఈ కేంద్రానికి మృతదేహాన్ని తీసుకు రావాలంటే నరక యాతన తప్పదు. గదిలో వైద్యుడు కూర్చొనేందుకు సదుపాయం కూడా లేకపోవడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీటితో పాటు కేంద్రానికి చుట్టూ ఆక్రమణలు పేరుకుపోయాయి. వైద్యవిధాన పరిషత్ ఈ కేంద్రం అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వైద్య సిబ్బంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వసతులు లేని ఆ కేంద్రంలో శవ పరీక్షలు చేయాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఆక్రమణలు తొలగించి శవ పరీక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details