ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదపాకలో అగ్నిప్రమాదం... 19 పూరిళ్లు దగ్ధం - adapaka latest news

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏడు గ్యాస్​ సిలిండర్లు పేలిపోయాయి. గూడు కోల్పోయి.. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

fire accident
అగ్నిప్రమాదం

By

Published : Apr 24, 2021, 9:50 AM IST

మంటల్లో పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో.. 19 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులంతా నిద్రలో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇళ్లలో ఉన్న సామగ్రితో పాటు తిండి గింజలు, నగదు, విలువైన వస్తువులు, భూమి పత్రాలు ఇతర వస్తువులు కాలి బుడిదయ్యాయి. బాధితులు కట్టు బట్టలతో మిగిలారు. ప్రమాదంలో 7 గ్యాస్‌ సిలిండర్లు పేలిపోగా.. ఒక ద్విచక్ర వాహనం కూడా దగ్ధమైంది.

అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆటోను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మిర్చి కూలీలు మృతి

ABOUT THE AUTHOR

...view details