ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాలీబాల్‌ క్రీడాకారుడే ఉపముఖ్యమంత్రి

By

Published : Jul 22, 2020, 9:12 AM IST

పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉప ముఖ్యమంత్రి పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు అప్పగించనున్నారు. రెవెన్యూ శాఖను ఆయనకే కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

dharmana krishna das
dharmana krishna das

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్న ధర్మాన కృష్ణదాస్‌.. గతంలో జాతీయస్థాయి వాలీబాల్‌ క్రీడాకారుడు, ఐదేళ్ల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ వాలీబాల్‌ పోటీలకు జాతీయ జట్టు మేనేజర్‌గా కూడా పనిచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసి గెలిచారు. 2014లో ఓడినా, మళ్లీ 2019లో గెలిచి మంత్రి పదవి చేపట్టారు. విశాఖపట్నం బుల్లయ్య కళాశాలలో బీకాం చదివి.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన ఆయన, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా జిల్లాకు చెందిన తొలి నేతగా ఈయన గుర్తింపు పొందనున్నారు.

ABOUT THE AUTHOR

...view details