శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడతవలస గ్రామంలో నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 250 లీటర్ల బెల్లం ఊటను లావేరు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారం మేరకు దాడులు నిర్వహించామని లావేరు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - ఎచ్చెర్ల నియోజకవర్గం
నాటుసారా తయారీకి ఉపయోగించే 250 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడతవలస గ్రామంలో చోటు చేసుకుంది.
250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం