చంద్రన్న బీమా పథకాన్ని నిర్వీర్యం చేసేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మండిపడ్డారు. పేద కుటుంబాలకు పథకం అందకుండా.. సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 51 సంవత్సరాలు పైబడిన వారి సహజ మరణాలకు పరిహారం ఎత్తివేశారని విమర్శించారు.
ఈపీఎఫ్ చెల్లించేవారిని, చిన్న ఉద్యోగులను సైతం పథకానికి అనర్హులను చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జనధన్ ఖాతాలు తప్పనిసరి చేసి.. ఖాతాలు లేని అసంఘటిత రంగ కార్మికులకు పథకాన్ని దూరం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల తర్వాత మరణించిన వారి కుటుంబాలకు నేటికీ ఎలాంటి బీమా అందలేదని అన్నారు.