ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాకు కరోనా సోకినా ఇక్కడే వైద్యం చేయించుకుంటా..: మంత్రి అప్పలరాజు - శ్రీకాకుళం జిల్లా వార్తలు

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈమేరకు మంత్రి అప్పలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

minister appalraju
minister appalraju

By

Published : Aug 4, 2020, 9:11 AM IST

శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేల మంది కరోనా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలపై వైద్యాధికారులతో మంత్రి అప్పలరాజు ప్రభుత్వ వైద్య కళాశాలలో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నామన్నారు. జీజీహెచ్‌లో అన్ని వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి.. తనకు కరోనా సోకినా ఇక్కడే వైద్యం చేయించుకుంటాని స్పష్టం చేశారు. కరోనా రోగులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. విశాఖపట్నంలో మూడు వందల పడకలను అందుబాటులో ఉంచామని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details