శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పెదసిర్లాం గ్రామానికి చెందిన 200 మంది వలస కూలీలు చెన్నైలో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వీరంతా లాక్డౌన్తో అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం పనులు లేకపోవడం వల్ల కడుపు నింపుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అక్కడ ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసతి సౌకర్యం లేదని.... తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నామని వాపోయారు. తమ పిల్లలు ఆంధ్రాలోనే ఉన్నారని... వారు ఎలా ఉన్నారో అన్న ఆలోచనలతో మనోవేదనకు గురవుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి తమను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
చెన్నైలో 200 మంది సిక్కోలు కూలీల అవస్థలు - కరోనా లాక్డౌన్
లాక్డౌన్తో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు తమిళనాడులోని చెన్నైలో చిక్కుకుపోయారు. తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తమను ఆదుకోవాలని... స్వస్థలాలకు పంపించాలని కోరుతున్నారు.
Migrant workers from Srikakulam
Last Updated : Apr 13, 2020, 7:32 AM IST