ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mega vaccination drive: శ్రీకాకుళం జిల్లాలో మెగా కొవిడ్ వ్యాక్సినేషన్

శ్రీకాకుళంలో మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా మూడు వందల సచివాలయాల పరిధిలో 90 వేల మందికి వ్యాక్సిన్​ వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సాయంత్రం వరకు కొవిడ్ టీకా వేసుకోవడానికి ప్రజలు రావచ్చని అధికారులు తెలిపారు.

Mega vaccination drive
మెగా కోవిడ్ వ్యాక్సినేషన్

By

Published : Jun 20, 2021, 1:15 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. జిల్లాలో మూడు వందల సచివాలయాల పరిధిలో 90 వేల మందికి వ్యాక్సిన్​ వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 0-5 సంత్సరాల వయస్సు గల పిల్లల తల్లులతో పాటు.. 45 సంవత్సరాల పైబడిన వారికి ఆదివారం టీకా వేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. మెగా వాక్సినేషన్​లో భాగంగా మొదటి, రెండవ డోసు కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకా​లను అధికారులు అందుబాటులో ఉంచారు. సాయంత్రం వరకు కొవిడ్ టీకా వేసుకోవడానికి రావచ్చని అధికారులు తెలిపారు. వాక్సినేషన్ వేసుకునేందుకు జనాలు టీకా కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details