తెదేపా నేత కూన రవికుమార్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు(Bail to Kuna Ravikumar) చేసింది. శనివారం పార్టీ కార్యాలయానికి బయల్దేరిన రవికుమార్‌ను.. ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులపై కూన రవికుమార్ దుర్భాషలాడినట్టు సీఐ ఈశ్వర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
353, 506, సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. సోదరుని ఇంట్లో ఉన్న కూన రవి కుమార్‌ను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుంచి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటల సమయంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు(tdp leader kuna ravikumar arrest) తీసుకెళ్లారు. అనంతరం న్యాయస్థానంలో హాజరు పరచగా.. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు అర్ధరాత్రి వచ్చి ఇంటివద్ద నానా హంగామా చేయడంతో.. తన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, పోలీసుల కుటుంబ సభ్యుల ఇంటికెళ్లి ఇలానే చేస్తే.. ఎలా ఉంటుంది అని కూన రవికుమార్ ప్రశ్నించారు.
అన్నివేళలా అండంగా ఉంటాం..!