ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్క్ లేకపోతే నిత్యావసర దుకాణాలకు నో ఎంట్రీ..!

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బయటికి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. వీటితో పాటు నిత్యావసరాలు కొనుగోలుకు దుకాణాలకు వెళ్లే ప్రతిఒక్కరు మాస్కులు వేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

vmask is compulsory for outside areas orderd by srikakulam dst
mask is compulsory for outside areas orderd by srikakulam dst

By

Published : May 8, 2020, 7:00 PM IST

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు... ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో అధికారులు దుకాణాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. రణస్థలం మండల కేంద్రంలో ఉన్న నిత్యావసర దుకాణాలను తనిఖీ చేసి సరకులు అమ్మకాల సమయంలో ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలని, మాస్కు ధరించాలని సూచించారు.

కొనుగోలుదారులు మాస్కు ధరించకపోతే వారికి సరకులు, వస్తువులను అమ్మరాదని దుకాణాల యజమానులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండిమద్యం కొంటే వేలికి సిరా వేయించుకోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details