తామరాపల్లి గ్రామానికి చెందిన పాగోటి చిన్నారావు(46) మార్కెట్ కమిటీలో హమాలీగా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. వెంటనే అతన్ని నరసన్నపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మృతి చెందారు. చిన్నారావు తన ఇంటికి ఎదురుగానే జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనం ఢీ కొని వ్యక్తి మృతి - శ్రీకాకుళం తామరాపల్లిలో బైక్ ఢీ కొని వ్యక్తి మృతి వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనం ఢీ కొని వ్యక్తి మృతి