ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండెపోటుతో యువకుడు ఆకస్మిక మృతి - శ్రీకాకుళంలో గుండెపోటుతో యువకుడు మృతి తాజావార్తలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యువకుడు ఆకస్మికంగా మృతి చెందడాడు. హైదరాబాద్​లో ప్రైవేట్​ కంపెనీలో పనిచేసిన నీలకంఠం ఉదయం నడకకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు.

man dead with heart attack at srikakulam district
గుండెపోటుతో యువకుడు ఆకస్మిక మృతి

By

Published : May 5, 2020, 4:38 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యువకుడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. బత్తుల నీలకంఠం (32).. ఉదయం నడక చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా కుప్ప కూలిపోయాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తరచుగా ఉపవాసాలు చేసే నీలకంఠం సోమవారం కూడా ఉపవాసం ఉన్నాడు.

మంగళవారం ఉదయం ఏమీ తినకుండా శరీరానికి శ్రమ కలిగించడం వల్లే గుండె పోటుకు గురై మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసిన నీలకంఠం.. తన అన్న కూతుర్ని చూడటానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా గ్రామంలోనే ఉండి పోయాడు.

ABOUT THE AUTHOR

...view details