శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేట మండలం కరకవలస గ్రామంలో రెండు కింగ్ కోబ్రా పాములను స్థానికులు హతమార్చారు. సమీప అటవీ ప్రాంతం నుంచి రెండు రాచ నాగులు గ్రామంలోకి వచ్చాయి. ఒక పామును రెండోది మింగి రహదారిపై బుసలు కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ పామును హతమార్చారు. ఈ క్రమంలో ఆ బారీ సర్పం మింగిన రెండో పాము బయట పడటంతో దాన్నీ చంపేశారు. ఈ రాచనాగులు ఏకంగా 14 అడుగులకు మించి పొడవు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.
14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!
14 అడుగుల కింగ్ కోబ్రా పాము ఎదురుతిరిగి బుస కొడితే ఇంకేమైనా ఉందా...! అంతే సంగతులు. అదే జరిగింది శ్రీకాకుళం జిల్లా కరకవలసలో.. ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ రెండు పాములు గ్రామంలోకి వచ్చాయి. పాములకు భయపడిన గ్రామస్థులు వాటిని హతమార్చారు.
14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!
ఇదీ చదవండి :
Last Updated : Aug 22, 2019, 6:01 AM IST