ప్రతిపక్షాలను వేధించాలన్న లక్ష్యంతోనే జగన్ సర్కారు పని చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనపై ఏర్పాటు చేసిన సిట్.. అందులో భాగమేనని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మాట్లాడుతూ.. జగన్ చర్యలతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదన్న ఆయన.. రిలయన్స్, అదానీ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు.సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నాటి కొందరు అధికారులపై ఇప్పటికీ కేసులున్నాయని కళా గుర్తు చేశారు.
'ప్రతిపక్షాలను వేధించడమే ప్రభుత్వ లక్ష్యం' - వైకాపా ప్రభుత్వంపై కళా వెంకట్రావు విమర్శల వార్తలు
వైకాపా పాలనపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత విధిస్తున్నారన్న ఆయన.. ప్రభుత్వ విధానాల వల్ల ప్రముఖ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు.
కళా వెంకట్రావు