ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యం పంచడానికి కాదు.. పాతికేళ్ల భవిష్యత్​ ఇవ్వటానికే జనసేన : పవన్​కల్యాణ్​ - రణస్థలం జనసేన సభ

Pawan Kalyan : జనసేన పార్టీ ఏర్పాటుపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ వ్యాఖ్యలు చేశారు. ఈనెల 12వ తేదీన శ్రీకాకుళంలోని రణస్థలంలో యువశక్తి పేరుతో జనసేన సభను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.

Pawan Kalyan
పవన్​కల్యాణ్​

By

Published : Jan 8, 2023, 9:47 AM IST

Pawan Kalyan : ప్రజలకు పాతిక కేజిల బియ్యం పంపిణీ చేయడానకి తాము రాజకీయాల్లోకి రాలేదని.. పాతికేళ్ల భవిష్యత్‌ ఇవ్వడానికే జనసేన పార్టీ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. పేదలకు, యువతకు అండగా జనసేన ఉంటుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో ఈనెల 12న నిర్వహించే జనసేన యువశక్తి సభకు యువత పెద్దఎత్తున తరలి రావాలని ఆయన ట్విట్టర్​లో ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మన యువత.. మన భవిత అంటూ పోస్ట్ చేశారు. రణస్థలంలో జరిగే సభలో ‘వాయిస్ ఆఫ్ యూత్’ వినేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్​లో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details