సీతంపేట మండలం పూతికవలస బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ పీవో శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు కోసం తయారు చేసిన భోజనం తినకుండా.. ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వండించుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కారణంగా హెచ్ఎం ఆనందరావును, డిప్యూటీ వార్డెన్ రమణమ్మలను సస్పెండ్ చేశారు. అలాగే ఏటీడబ్ల్యువో వెంకటరమణకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇక నుంచి అన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని శ్రీధర్ వెల్లడించారు.
కాకరకాయ ఎందుకు వండారు హెచ్ఎం గారు చెప్పండి. పిల్లలకు నీళ్ల సాంబరూ పెట్టి మీరు ప్రత్యేకంగా పప్పు,కాకరకాయ చేయించుకొని తింటున్నారా? మాట్లాడండి హెచ్ఎం గారు.. ఇక్కడ ఫుడ్ పిల్లలకు మాత్రమే కదా.. టీచర్ల ఎందుకు తింటున్నారు. మీ బాక్స్ ఎక్కడ. దొంగలు,దొంగలు ఊరు పంచుకొని మెుత్తం క్వాలిటీగా తింటూ.. పిల్లలకు నీళ్ల సాంబార్ పెడుతున్నారా.. ?