ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - పాలకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత కాలేదని ఓ విద్యార్ధిని మనస్థాపానికి గురై.. ఉరి వేసుకుని చనిపోయింది. ఈ విషాదం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగింది.

srikakulam district
విద్యార్థిని-ఆత్మహత్య

By

Published : Jun 13, 2020, 2:57 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ అ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇంటర్ విద్యార్థిని.. దూసి స్వర్ణలత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిన ఆమె.. ఉత్తీర్ణత సాధించలేకపోయింది.

తీవ్ర మనస్థాపానికి గురైన స్వర్ణలత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

ABOUT THE AUTHOR

...view details