శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రం పురం గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామానికి చెందిన పలువురు అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తమ వద్ద తీసుకున్న భూములకు సరైన సొమ్ము చెల్లించలేదని భూయజమానులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎకరాకు 15 లక్షలు ఇస్తామని చెప్పి 11 లక్షలే ఇచ్చారని వారంతా ఆరోపించారు. నిరసనగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు అడ్డుకొని వేతనదారులను వెనక్కి పంపారు. అధికారులు తమ న్యాయం చేసే వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు.
ఉపాధి హామీ పనులను అడ్డుకున్న గ్రామస్థులు - శ్రీకాకుళం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో ఉపాధి హామీ పనులను కొందరు గ్రామస్థులు అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తమ వద్ద తీసుకున్న భూములకు సరైన విలువ అందించలేదని నిరసన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పనులను అడ్డుకున్న గ్రామీణులు