ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తూపాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు.. - ap latest news

గులాబ్ తూపాన్​ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గార, కవిటిలో విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగారు. తుపాను పరిస్థితులను బట్టి ఆపదలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

impact-of-gulab-typhoon-in-srikakulam-district
శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తూపాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు..

By

Published : Sep 26, 2021, 8:47 AM IST

గులాబ్‌ తుపాన్​ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. గార, కవిటిలో విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గులాబ్ తపాన్ దృష్ట్యా.. జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, పోలీసు, మైరైన్ పోలీసు, విద్యుత్తు, ఆర్అండ్ బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సెలవు రద్దు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

తుపాను పరిస్థితులను బట్టి ఆపదలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్ తోపాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557, ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933 లను విడుదల చేశారు. అప్రమత్తమైన రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే మరికొన్ని రైళ్ల దారిని మళ్లించింది.

ఇదీ చూడండి:GULAB TUPAN: ఉత్తరాంధ్రకు గులాబ్ ముప్పు.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details