ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో పురుషోత్తం చెక్పోస్ట్ వద్ద మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 59 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అంచనా వేశారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... ఒడిశాలోని బ్రహ్మపురం నుంచి విశాఖకు కారులో తరలిస్తున్న మద్యాన్ని గుర్తించామన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.