విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట విద్యుత్ ఉద్యోగుల యూనియన్ 1104 ఆధ్వర్యంలో మీటర్ రీడింగ్ సిబ్బందికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి... కరోనా వైరస్ సమయంలో విద్యుత్ ఉద్యోగుల సేవలు గొప్పవని అన్నారు.
'విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా' - విద్యుత్ ఉద్యోగుల కష్టాలు
విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో మీటర్ రీడింగ్ సిబ్బందికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో వారి సేవలను ప్రశంసించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
minister dhrmana