శ్రీకాకుళంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు క్రిమినాశక ద్రావణాన్ని పిచికారీ చేయాలని... జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశాలు జారీ చేశారు. నాసిక్ నుంచి తెప్పించిన మిస్ట్ స్ప్రేయర్ యంత్రాన్ని ట్రాక్టర్ కు అమర్చి కంటైన్మెంట్ జోన్లలో రసాయన ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో స్ప్రేయింగ్ చేసిన అనంతరం పీఎన్ కాలనీ చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తామని నగర పాలక సంస్ధ కమిషనర్ నల్లనయ్య చెప్పారు.
'క్రిమినాశక ద్రావణాన్ని పిచికారీ చేయాలి'
కొన్ని రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పట్టణంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు.
శ్రీకాకుళంలో క్రమిసంహారక ద్రావణం పిచికారీ