శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కుంభవృష్టి తలపించేలా భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సమయంలో కురిసిన వర్షంతో నరసన్నపేట పట్టణం అతలాకుతలమైంది. వీధులన్నీ నీటితో నిండిపోయి..రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ఈ వర్షానికి ఇల్లు, దుకాణాల్లోకి వరద ప్రవేశించడంతో ప్రజలు బకెట్లతో నీరు తోడిపోశారు. అంతేగాక వర్షం కారణంగా నరసన్నపేట బస్టాండ్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
నరసన్నపేటలో భారీ వర్షం..జలమయమైన లోతట్టు ప్రాంతాలు - heavy rainfall
శ్రీకాకుళంలో వర్షానికి నీటి వరదతో వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు నానాఅవస్థలు పడ్డారు.
heavy rainfall in narasannapeta in srikakulam district