ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం: పోటెత్తిన వంశధార, నాగావళి - vamshadara flood latest news

భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు పోటెత్తాయి. మడ్డవలస ప్రాజెక్టు నుంచి వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

srikakulam flood
శ్రీకాకుళంలో భారీ వర్షాలు

By

Published : Oct 14, 2020, 5:57 PM IST

వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో నాగావళి, వంశధార నదులు పోటెత్తాయి. రెండు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు. జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేలా, మండల కేంద్రాల్లో కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు చేశారు.

మెళియాపుట్టి మండలంలో రాధాకంత సాగరం గెడ్డ ప్రవాహానికి, గోకవర్ణపురానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి గురించి, స్థానికులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.

ఇదీ చదవండి:కుండపోత వర్షం.. అపార పంట నష్టం

ABOUT THE AUTHOR

...view details