గుట్కా, పాన్ తదితర వాటిపై నిషేధం ఉన్నప్పటికీ విచ్చలవిడిగా వాటి అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా వాటిని విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని పలు గ్రామాల్లో గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.90 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - లావేరులో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం, బుడుమూరు ప్రాంతాల్లో అక్రమంగా గుట్కా తరలిస్తున్న ఇధ్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 90వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
రూ. 90వేలు విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
వెంకటాపురం, బుడుమూరు కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా 8 బస్తాల గుట్కా ప్యాకెట్లను గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 90 వేలు ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి... రైలుకు బ్రేకులు వేసి యువకుడిని కాపాడాడు!