శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆటో కార్మికులు... కంబిరిగాం జాతీయ రహదారి పైవంతెన కూడలిలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ శంకరరావు, తహసీల్దార్ మధుసూదన్ లు విగ్రహం తొలగించాలని సూచించారు. లేకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఫలితంగా కార్మికులు విగ్రహాన్ని తొలగించారు.
అనుమతులు లేవని.. దుర్గామాత విగ్రహం తొలగింపు - palasa latest news
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబిరిగాం వద్ద జాతీయ రహదారి పైవంతెన కూడలిలో దుర్గామాత విగ్రహాన్ని తొలగించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం చెప్పిన మేరకు.. కార్మికులు అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు.
అనుమతులు లేవని దుర్గామాత విగ్రహం తొలగింపు