శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అమలపాడుకు చెందిన ధనరాజు.. పాతపట్నం మండలం సీదిగంగువాడకు చెందిన మురళీకృష్ణ ఇద్దరు ఆర్మీ జవాన్లు. వీరు ఇద్దరూ బెంగుళూరులోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నారు. అక్కడ హత్య, పలు నేరాలను కలిసికట్టుగా చేసి.. బైయిల్‌పై జిల్లాకు చేరుకున్నారు. జూన్ 18వ తేదీన వీరు ఇద్దరూ కలుసుకున్నారు. పక్కా ప్రణాళికతో శీతల పానీయంలో మత్తుమందు కలిపి ధనరాజుకు మురళీకృష్ణ ఇచ్చాడు. ఆపస్మారకస్థితికి చేరిన ధనరాజును హతమార్చి.. కారులో సారవకోట మండలం దాసుపురం సమీపంలో పాతిపెట్టాడని ఎస్పీ అమిత్ బర్డర్ వివరించారు. ధనరాజు ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో తల్లి లీలావతి.. వజ్రపుకొత్తూరు పోలీసుస్టేషన్‌లో ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేసింది. రంగంలోకి పోలీసులు కేసును ఛేదించారు.
శీతలపానియంలో మత్తుమందు ఇచ్చి... ఆపై హత్య చేసి.. - Srikakulam district latest news
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఆర్మీ జవాన్ (ఇప్పుడు విధుల్లో లేరు) హత్య కేసును పోలీసులు ఛేదించారు. సారవకోట మండలం దాసుపురం సమీపంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ వెల్లడించారు.
శీతలపానియంలో మత్తుమందు ఇచ్చి... ఆపై హత్య చేసి..