పాతపట్నంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం - eyes
పాతపట్నంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి విశాఖ శంకర్ ఫౌండేషన్లో ఉచిత వైద్యం అందించనున్నారు.
'పాతపట్నంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ'
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉచిత వైద్య నేత్ర శిబిరం ప్రారంభించారు. కోదురు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నీలేశ్వరరావు సహాయంతో విశాఖ శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం సమీప గ్రామాల ప్రజలు ఉచితంగా.. కంటి పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. శస్త్ర చికిత్స అవసరమైన వారిని.. శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వెద్యం చేయనున్నట్లు కో ఆర్డినేటర్ రామారావు తెలిపారు.