బీసీలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కేందుకు సీఎం జగన్... రిజర్వేషన్లు, ఎన్నికలను హడావుడిగా ప్రకటించారని రాష్ట్ర తేదేపా అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. అరాచకాలు సృష్టించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పనీ చేయట్లేదని శ్రీకాకుళంలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజార్టీతో గెలిపించి వైకాపాకు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీసీలకు అన్యాయం చేయడానికే ఎన్నికల హడావిడి: కళా - కళా వెంకట్రావు తాజా వార్తలు
బీసీలను అణగదొక్కేందుకే రిజర్వేషన్లు, ఎన్నికలను హడావుడిగా ప్రకటించారని మాజీ మంత్రి, రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రభుత్వ పని తీరుపై మండిపడ్డారు.
వైకాపాపై మండిపడ్డ మాజీమంత్రి కళా వెంకట్రావు