ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం' - విద్యుత్ బిల్లులపై మీడియా కూనరవి కుమార్ సమావేశం

వైకాపా ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం పెంచారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

former Government Whip kuna ravi kumar media conference on electricity bills  in amudalavalasa
విద్యుత్ బిల్లులపై మీడియా కూనరవి కుమార్ సమావేశం

By

Published : May 22, 2020, 2:30 PM IST

వైకాపా ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయితీ విత్తనాలు ఇవ్వటంలేదని.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం పెంచారని మండిపడ్డారు. తెదేపా ఐదేళ్ల పాలనలో విద్యుత్ బిల్లులపై పైసా కూడా పెంచలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నూకరాజు కొండలరావు, శివతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details