శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిశాం వద్ద ఉన్న శాంపిస్టన్స్ పరిశ్రమలో పనిచేస్తూ... అనారోగ్యంతో మృతి చెందిన కె. నరసింహమూర్తి కుటుంబానికి అండగా... తోటి కార్మికులు రూ.5,02,950 ఆర్థిక సహాయం అందించారు.
అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని శాంపిస్టన్స్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ... మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయం చేసినవారిని పలువురు అభినందించారు.
అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులందరూ... తమ ఒకరోజు వేతనాన్ని అందజేయడం అభినందనీయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు అన్నారు. తోటి కార్మికుని కుటుంబానికి అండగా నిలిచిన కార్మికులను పలువురు అభినందించారు.
ఇదీచదవండి.