ఖరీఫ్ ఆరంభం కావడంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వద్ద విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నందున్న అధిక సమయం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయితీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం వద్ద ఈ రోజు నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభించారు. కొనుగోలు కోసం పెద్ద ఎత్తున ఉదయం నుంచి కార్యాలయానికి చేరుకున్నారు. కౌలు రైతులకు విత్తనాలు ఇవ్వనందున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాల కోసం రైతుల అవస్థలు - farmers
విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్న కారణంగా.. సమయం అధికంగా పడుతోంది.
farmers problems for seeds