శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో పురుగుల మందు తాగి గుర్రం రాంబాబు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం పురుగులమందు సేవించిన రాంబాబుని స్థానికులు పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్య సేవలకు శ్రీకాకుళం తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో రాంబాబు మృతి చెందాడు. రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - శ్రీకాకుళం జిల్లా
అప్పులబాధ తాళలేక గుర్రం రాంబాబు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటుచేసుకుంది.
అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య