తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను అణచివేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోందని... మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీకాకుళంలోని కూన రవికుమార్ ఇంటికి తెదేపా బృందం వచ్చింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో వచ్చిన చిన్నరాజప్ప... మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలు లేకుండా వైకాపా సర్కారు పాలన ఉందని విమర్శించారు. ప్రభుత్వ పాలసీలపై మాట్లాడటంలేదన్న మాజీ హోంమంత్రి... చంద్రబాబును అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతోనే వైకాపా సర్కారు పనిచేస్తుందని ధ్వజమెత్తారు.
కక్షపూరితంగానే తెదేపా నేతలపై తప్పుడు కేసులు - ex home minister
ప్రజాస్వామ్య విలువలు లేకుండా వైకాపా సర్కారు పాలన ఉందని మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప విమర్శించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప