రక్త దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని రెడ్‌క్రాస్ వద్ద శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్తదానం చేయటం ద్వారా మరో ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు.
రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: మంత్రి ధర్మాన
రక్తదానం ద్వారా మరో ప్రాణాన్ని నిలబెట్టవచ్చని.. రక్తదాన శిబిరాలు నిర్వహించటం గొప్ప కార్యక్రమం అన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు.
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి