శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ లోడగలపేట గ్రామానికి చెందిన లోడగల సూరిబాబు(39) ఉపాధిహామీ పని చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తోటి వేతనదారులు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏపీవో సత్యవతి తెలిపారు. సూరిబాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ కూలీ మృతి - srikakulam district
శ్రీకాకుళం జిల్లా రణస్థం మండలం పైడిబీమవరం పంచాయతీ లోడగలపేట గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మృతి చెందాడు. కుటుంబ పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఉపాధి హామీ వేతనదారుడు మృతి