శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పెరిగిన విద్యుత్ బిల్లులతో వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. గత బిల్లుల కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని వాపోతున్నారు.
విద్యుత్ బిల్లుల మోతతో జనం ఆందోళన
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పెరిగిన విద్యుత్ బిల్లులతో వినియోగదారులు షాక్ గురౌతున్నారు. గతం కంటే అధికంగా వస్తున్నాయని వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల మాత్రం శ్లాబుల రేట్లు పెంచలేదని, వినియోగానికి తగ్గట్లే బిల్లులు వస్తున్నాయని చెప్తున్నారు.
విద్యుత్ బిల్లుల మోత
ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా శ్లాబ్ రేట్లు పెంచలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం అపోహే అన్నారు. వినియోగం పెరిగి.. బిల్లులు ఎక్కువగా వస్తున్నట్టు చెప్పారు.