కృష్ణాజిల్లా నందిగామలో తెదేపా, వైకాపా పార్టీల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. అభ్యర్థి శాఖమూరు స్వర్ణలత తరపున ప్రచారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తమ అభ్యర్థి మండవ వరలక్ష్మిని గెలిపించాలంటూ ఓటర్లను కోరారు.
ఇంకా మూడు రోజులే.. జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచార సమయం ఇంకా మూడు రోజులే ఉండటంతో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుస్తున్నారు.
నగర పంచాయతీ పరిధిలో 20 వార్డుల్లో అన్నీ ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. జనసేన, భాజపా, సీపీఎం పార్టీలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అన్ని వార్డుల్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు.. చివరి మూడు రోజుల్లో మరో దఫా కలిసేందుకు పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఈసారి కూడా విజయం సాధించాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైకాపా నేతలు కృషి చేస్తున్నారు.
ఇదీ చదవండి:విజయవాడ: మున్సిపల్ ప్రచారంలో నేతలు.. ఏర్పాట్లలో అధికారులు