శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం సీనియర్స్ విభాగం నుంచి 8 జట్లు పాల్గొనగా నాలుగు జట్లు విజయం సాధించాయి.
1. శ్రీ సాయి దంత వైద్యకళాశాల, శ్రీకాకుళం × ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), శ్రీకాకుళం జట్లు తలపడగా.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.
2. రెండో మ్యాచ్లో విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, టెక్కలి × టీఆర్ఎస్ డిగ్రీ కళాశాల, ఆముదాలవలస జట్లు తలపడ్డాయి. అందులో విశ్వజ్యోతి జట్టు గెలుపొందింది.
3. అనంతరం జరిగిన మూడో మ్యాచ్లో గాయత్రి కాలేజ్ పీజీ, మునసపుపేట × జీఎంఆర్ ఐటీ, రాజాం జట్లు తలపడగా.. జీఎంఆర్ జట్టు గెలిచింది.
4. చివరిగా శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎచ్చెర్ల × ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి జట్లు తలపడ్డాయి. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విజయం సాధించింది.