ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 డిమాండ్లు- 17 గంటల దీక్ష - protest

ఉత్తరాంధ్రకు ప్రయోజనం చేకూర్చే విధంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటనలో మార్పులు కోరుతూ రామ్మెహన్ నాయుడు నేడు దీక్షకు దిగనున్నారు. ప్రధానంగా 3 డిమాండ్లతో 17 గంటలపాటు దీక్ష చేపట్టనున్నారు.

రామ్మెహన్ నాయుడు

By

Published : Mar 5, 2019, 11:59 AM IST

Updated : Mar 5, 2019, 12:09 PM IST

విశాఖ రైల్వే జోన్ ప్రకటించినా ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మూడు రోజులగా నిరసన గళం వినిపిస్తున్న ఎంపీ రామ్మెహన్ నాయుడు ఈ రోజు దీక్షకు దిగనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్​లో దీక్ష చేపట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస స్టేషన్‌ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న ఎనిమిది స్టేషన్లను ఒడిశా రాష్ట్రానికి చెందిన కుర్దా డివిజన్‌ నుంచి తప్పించాలని, వీటిని విశాఖ రైల్వే జోన్​కు కలపాలని రామ్మెహన్ నాయుడు కోరుతున్నారు. అలాగే ఆదాయాన్నిచ్చే వాల్తేరు డివిజన్​ విభజించకుండా విశాఖ జోన్​కే కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్​తో కలిసి ఎంపీ దీక్ష చేపట్టనున్నారు.

Last Updated : Mar 5, 2019, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details