రిజర్వేషన్ల తంట.. ఓట్లకు దూరం - Distance to votes with reservations
కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీలో 1,225 మంది ఓటర్లున్నారు. వాళ్లంతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఓట్లు వేసినవాళ్లే. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం గత రెండుసార్లుగా ఓటు వేయలేకపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీలో 1,225 మంది ఓటర్లున్నారు. వాళ్లంతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఓట్లు వేసినవాళ్లే. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం గత రెండుసార్లుగా ఓటు వేయలేకపోతున్నారు. 2006 తర్వాత వచ్చిన రెండు స్థానిక ఎన్నికల్లోనూ ఈ గ్రామం వారు ఓట్లు వేయలేదు. ఈసారి కూడా వాళ్లంతా ఆ హక్కుకు ఆమడదూరంగానే ఉండిపోతున్నారు. ఎందుకంటారా.. రిజర్వేషన్ల మహిమ! ఈ గ్రామ సర్పంచి పదవిని ఎస్టీలకు రిజర్వు చేయగా.. అసలు గ్రామం మొత్తమ్మీద ఎస్టీలు ఒక్కరూ లేరు. దాంతో ఎవరూ పోటీ చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. పోటీచేసే అభ్యర్థే లేకపోతే ఇక ఓట్లు ఎవరికి వేయాలని వాళ్లంతా వాపోతున్నారు.